వార్తలకు తిరిగి వెళ్లండి

కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ ట్రస్ట్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు రూ.10,016 విరాళంగా అందించారు. గేటుకారేపల్లిలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆయన్ని కలిసి కోరగా, ఆయన వెంటనే స్పందించి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వల్లబినేని చంద్రశేఖర్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సపావట్ నాగులు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. దైవ కార్యానికి సహకరించిన తిరుమలరావును కమిటీ సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...

