Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారికి రూ.1.33 కోట్ల భారీ విరాళం

Follow Udayam on Google
Rohit Singh May 30, 2026 12:01 PM తిరుపతిGeneral
శ్రీవారికి రూ.1.33 కోట్ల భారీ విరాళం - Udayam
తిరుమల శ్రీవారికి భక్తురాలు నీరా రాడియా రూ.1.13 కోట్ల విలువైన విద్యుత్ బస్సుతో పాటు రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్‌లను విరాళంగా ఇచ్చారు. ఆలయం వద్ద వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తాళాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. ఈ ట్యాబ్‌లను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కమాండ్ సెంటర్ కోసం ఉపయోగించనున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా త్వరలోనే అన్ని డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు.

Comments

G
Loading comments...