వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలంలో వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున, రైతులు తొందరపడి పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు వేయవద్దని జిల్లా వ్యవసాయ శాఖ హెచ్చరించింది. భూమిలో కనీసం 60 నుండి 70 మి.మీ. వర్షపాతం నమోదై, తగినంత తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలని అధికారులు సూచించారు.
వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు 'ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక'ను సిద్ధం చేశారు. వర్షాలు ఆలస్యమైతే వరి నాట్లకు బదులు వెదజల్లే పద్ధతిని పాటించాలని, స్వల్పకాలిక రకాలు లేదా పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు వైపు మొగ్గు చూపాలని గ్రామసభల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

