వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డీజే సౌండ్‌ను మంగళవారం రాత్రి పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి. నరేష్ తెలిపారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా అనుమతులు లేకుండా డీజే నిర్వహించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

