వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మే 14న విచారణ జరగనుంది. బాలికను వేధించారనే ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు, సదరు బాలిక కుటుంబమే తనను డబ్బు కోసం బెదిరిస్తోందని భగీరథ్ కరీంనగర్‌లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు న్యాయస్థానం మెట్లు ఎక్కింది.
Comments
Loading comments...

