వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం కురిసిన భారీ ఈదురుగాలుల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దమ్మపేట, పాల్వంచ తదితర మండలాల్లో మామిడి, అరటి తోటలు నేలకొరిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.
పంటలు నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే తమ ధాన్యం తడిసిందని వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

