వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో ఈవీ పాలసీకి కేబినెట్ ఆమోదం

ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఆమోదం తెలిపింది. వచ్చే నెల నుంచి నాలుగేళ్ల పాటు దశలవారీగా అమలు కానున్న ఈ పాలసీ కోసం 15 వేల కోట్ల రూపాయలను కేటాయించారు.
2030 నాటికి ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈవీ మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు పన్ను మినహాయింపులకు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
Comments
Loading comments...