వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ వాయు కాలుష్యానికి భారీ చెక్

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో రూ.8,300 కోట్ల భారీ వ్యయంతో ‘క్లీన్ ఎయిర్, హెల్తీ ఢిల్లీ’ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈ ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా వాయు నాణ్యతను మెరుగుపరచనున్నారు.
ఎలక్ట్రికల్ వాహనాల ప్రోత్సాహం, పాత వాహనాల తొలగింపు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ద్వారా ఉద్గారాలను తగ్గించడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.
Comments
Loading comments...