వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. మనీలాండరింగ్ కేసులో పేరుందని భయపెట్టి, ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ. 58.94 లక్షలను వసూలు చేశారు. ఆధార్ దుర్వినియోగమైందని నమ్మబలికి దశలవారీగా బాధితుడి ఖాతా నుంచి నగదును కాజేశారు.
మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

