Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100% సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 03, 2026 6:36 PM నల్గొండGeneral
100% సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ - Udayam
గట్టుప్పల్‌లో 'పత్తి ఉత్పాదకత మిషన్' కింద రైతులకు శుక్రవారం 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. సాగు వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందిస్తోందని వ్యవసాయ అధికారిణి రేవతి తెలిపారు. ఈ విత్తనాలను నిర్ణీత విధానంలో సాగు చేయాలని, పంటను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...