Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కచ్ తీరంలో రూ.1150 కోట్ల కొకైన్ సీజ్

Follow Udayam on Google
Vikram Chandra May 27, 2026 1:34 PM జాతీయంGeneral
కచ్ తీరంలో రూ.1150 కోట్ల కొకైన్ సీజ్ - Udayam
గుజరాత్‌లోని కచ్ తీరంలో అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఒక యూరోపియన్ నౌక ద్వారా జరుగుతున్న డ్రగ్స్ రవాణాను గుజరాత్ ఏటీఎస్, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సంయుక్తంగా అడ్డుకున్నారు. సముద్రంలోకి విసిరేసిన సంచులను స్వాధీనం చేసుకోగా.. అందులో 100 కిలోల కొకైన్ ఉన్నట్లు తేలింది. దీని విలువ రూ.1150 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసి, నౌకను సీజ్ చేశారు.

Comments

G
Loading comments...