Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎన్‌జీ, ఇంధన ధరల పెంపు

Follow Udayam on Google
Anisha Gupta May 26, 2026 10:53 AM జాతీయంGeneral
సీఎన్‌జీ, ఇంధన ధరల పెంపు - Udayam
కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ధరను కిలోకు మరో రూ.2 పెంచింది. మే 15 నుంచి ఈ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.83.09కి చేరింది. గత 11 రోజుల్లోనే మొత్తం రూ.7 వరకు పెరగడంతో వాహనదారులపై తీవ్ర భారం పడనుంది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.12కు, డీజిల్‌ రూ.95.20కి చేరాయి. 11 రోజుల్లో ఇంధన ధరలు రూ.7.5 మేర పెరగడం గమనార్హం.

Comments

G
Loading comments...