Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగమాంబకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం

Follow Udayam on Google
Ravi Shukla May 20, 2026 1:59 PM అమరావతిGeneral
గంగమాంబకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం - Udayam
చిత్తూరు జిల్లా కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య జాతర వైభవంగా కొనసాగింది. సీఎం పర్యటనతో కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...