Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువు ముగిసిన చాక్లెట్ల గుట్టురట్టు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 03, 2026 10:05 AM జాతీయంGeneral
గడువు ముగిసిన చాక్లెట్ల గుట్టురట్టు - Udayam
ఢిల్లీలోని ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలో కాలం చెల్లిన అంతర్జాతీయ బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠాను సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తయారీ, గడువు తేదీలను మార్చి, తిరిగి ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 20 లక్షలకు పైగా విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...