వార్తలకు తిరిగి వెళ్లండి
చైనా మెగా ప్రాజెక్టుకు ముప్పు

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు భూగర్భ పగులు రూపంలో పెను ముప్పు పొంచి ఉందని ఆ దేశ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. టిబెట్‌లోని నైంగ్చీ ప్రాంతంలో జరుగుతున్న ఈ నిర్మాణం కింద క్రియాశీల 'పైజెన్ ఫాల్ట్' ఉన్నట్లు గుర్తించారు.
ఈ బీటల వల్ల అక్కడ నిర్మించే డ్యామ్‌లు, రోడ్లు, సొరంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని జియాలజిస్టులు స్పష్టం చేశారు. మంచుయుగం నాటి ఈ పగులు మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా అధ్యయనంలో వెల్లడైంది.
Comments
Loading comments...