Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తకుప్పలతో ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 12, 2026 6:59 PM హైదరాబాద్General
చెత్తకుప్పలతో ప్రజలకు ఇబ్బందులు - Udayam
హైదరాబాద్ : తిరుమలగిరి, బొల్లారం తదితర ప్రాంతాల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. తడి, పొడి చెత్తకు ప్రత్యేక డస్ట్ బిన్‌లు లేకపోవడంతో ప్రజలు రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడంతోపాటు పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రతతో వ్యాధులు వ్యాపించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...