వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం ఖానాపురం శివారులో కోదాడ పెద్ద చెరువు శిఖం భూమిలో అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నారని మత్స్యకార సంఘం అధ్యక్షుడు శీలం నాగేంద్రబాబు ఆరోపించారు. అధికారులు నోటీసులు ఇచ్చినా నిర్మాణం ఆగడం లేదన్నారు.
దీంతో 600 మంది మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే సభ్యులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

