వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ, కేంద్రం తన సేకరణ లక్ష్యాన్ని 35 శాతం తగ్గించిందని మండిపడ్డారు. దేశ యాసంగి కొనుగోళ్లలో తెలంగాణ వాటానే 60 శాతంగా ఉందన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రం సమస్యలు సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్నలను సేకరిస్తోందని, బీజేపీ నేతలు రాజకీయం మానాలని హితవు పలికారు.
Comments
Loading comments...

