Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి కేంద్రం సిద్ధం

Rohit Singh May 27, 2026 8:36 AM అల్ ఇండియా 10 viewsabout 11 hours ago
ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి కేంద్రం సిద్ధం - Udayam Digital
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC)లో మరోసారి వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే జూన్ లేదా జులై నెలల్లో దాదాపు 2 శాతం మేర షేర్లను విక్రయించాలని యోచిస్తోంది. దీని ద్వారా సుమారు రూ.10వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వాటాలను సంస్థాగత మదుపర్లకు విక్రయించనున్నారు. ఈ భారీ లావాదేవీని నిర్వహించడానికి గోల్డ్‌మన్ శాక్స్, మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...