వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం నిఘాను తీవ్రం చేసిందని వెల్లడించారు.
వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశంలోని ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులలో కఠినమైన స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే టెస్టింగ్, నిఘా ప్రక్రియలను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ సంస్థలకు మంత్రి సూచించారు.
Comments
Loading comments...

