Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడుదలైన సీబీఎస్‌ఈ టెన్త్ సెకండ్ బోర్డ్ ఫలితాలు

కిషోర్ కుమార్ Jul 18, 2026 9:39 PM అల్ ఇండియా about 2 hours ago
విడుదలైన సీబీఎస్‌ఈ టెన్త్ సెకండ్ బోర్డ్ ఫలితాలు - Udayam Digital
​కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) పదో తరగతి సెకండ్ బోర్డ్ పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది మే-జూన్ నెలల్లో నిర్వహించిన ఈ ఫేజ్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 6.6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ​విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు. కాగా, అంతకుముందు ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 పరీక్షలు జరగ్గా.. ఈ రెండు పరీక్షల్లో ఏ ఫేజ్‌లో ఎక్కువ మార్కులు వస్తే వాటినే తుది ఫలితాలుగా ఎంచుకునే అవకాశాన్ని బోర్డు కల్పించింది.

Comments

G
Loading comments...