Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాకు దూరం.. నీట్ 20వ ర్యాంక్!

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 18, 2026 9:48 PM జాతీయంGeneral
సోషల్ మీడియాకు దూరం.. నీట్ 20వ ర్యాంక్! - Udayam
​నీట్ రీటెస్ట్-2026లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన కర్ణాటకకు చెందిన వైష్ణవి దాస్ తన విజయ రహస్యాన్ని పంచుకున్నారు. తాను 11వ తరగతిలోనే ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేశానని, దానివల్ల సమయం వృథా తప్ప లాభం లేదని పేర్కొన్నారు. ఈమెకు ఈ పరీక్షలో 720 మార్కులకు గానూ 700 మార్కులు రావడం విశేషం. ​రోజువారీ గంటల లెక్కన కాకుండా, వారం ప్లాన్‌తో చదివేదాన్నని వైష్ణవి తెలిపారు. పరీక్షల్లో విజయానికి మాక్ టెస్టులు రాయడం, ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పుస్తకాలను రివిజన్ చేయడం మరియు సానుకూల దృక్పథం (పాజిటివ్ మైండ్‌సెట్) కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని ఆమె వివరించారు.

Comments

G
Loading comments...