వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. భూత్పూర్ మండలం హస్నాపూర్‌లో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడారు.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు. బస్తాకు అదనంగా రూ.15 డిమాండ్ చేసిన ఐకేపీ సెంటర్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని, వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

