Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు KTPPని సందర్శించనున్న BRS నేతలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:00 PM హన్మకొండ General
రేపు KTPPని సందర్శించనున్న BRS నేతలు - Udayam
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (KTPP)ను రేపు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సందర్శించనున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నేతలు ప్లాంట్‌లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...