Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లో భారత కాన్సులర్ సేవలకు బ్రేక్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 03, 2026 5:14 PM జాతీయంGeneral
విదేశాల్లో భారత కాన్సులర్ సేవలకు బ్రేక్ - Udayam
ఆస్ట్రేలియా, కువైట్, యూఏఈ దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ప్రస్తుతం పరిమిత కాన్సులర్ సేవలను మాత్రమే అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. సేవల్లో సహకరిస్తున్న ఔట్‌సోర్సింగ్ సంస్థల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని, ఢిల్లీ హైకోర్టు నుండి వచ్చే తదుపరి ఆదేశాల కోసం తాము వేచి చూస్తున్నామని జైస్వాల్ స్పష్టం చేశారు. అప్పటివరకు ఈ దేశాల్లోని భారతీయులకు పరిమిత సేవలే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...