వార్తలకు తిరిగి వెళ్లండి

రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారిపై బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ఏజెంట్లు కస్టమర్ల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సీరియస్ అయింది.
రికవరీల కోసం వినియోగదారుల స్మార్ట్‌ఫోన్లను స్తంభింపజేయడం లేదా డిజిటల్ సేవలను నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి కఠినమైన చర్యలను అడ్డుకునేందుకు త్వరలోనే కొత్త ప్రతిపాదనలు తీసుకురానుంది. లోన్ రికవరీ ప్రక్రియలు ఎల్లప్పుడూ నిబంధనల ప్రకారమే జరగాలని, కస్టమర్ల హక్కులను ఉల్లంఘించకూడదని హెచ్చరించింది.
Comments
Loading comments...

