వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ 'ప్రీమియర్ ఎనర్జీస్' ప్రమోటర్లు తమ 5.29% వాటాను బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు. బ్లాక్ డీల్ ద్వారా జరిగిన ఈ లావాదేవీలో ఒక్కో షేరును సగటున రూ.995 చొప్పున మొత్తం రూ.2,290.59 కోట్లకు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు కొనుగోలు చేశాయి.
నోమురా, క్యాపిటల్ గ్రూప్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ వంటి ప్రపంచ దిగ్గజాలతో పాటు దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ షేర్లను దక్కించుకున్నాయి. ఈ తాజా విక్రయంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 63.94 శాతం నుండి 58.65 శాతానికి తగ్గింది.
Comments
Loading comments...

