వార్తలకు తిరిగి వెళ్లండి
కూకట్పల్లి, మూసాపేట భూముల విక్రయాలను నిలిపివేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూకట్పల్లి, KPHBలో రూ.2 వేల కోట్ల విలువైన భూములు విక్రయించారని ఆరోపించారు.
పార్కులు, ట్రాక్లు, పెట్రోల్ బంకుల కోసం కేటాయించిన స్థలాలనూ అమ్మకానికి పెడుతున్నారని అన్నారు. మియాపూర్లో 400 ఎకరాల భూములను గజం రూ.2.75 లక్షల చొప్పున విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

