వార్తలకు తిరిగి వెళ్లండి

2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల కోసం భద్రాచలంలో పర్యావరణ హితంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి మందికి పైగా వచ్చే భక్తుల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు, కరకట్ట పరిసరాలలో జపాన్ సాంకేతికతతో తక్కువ కాలంలో పెరిగే ప్రత్యేక ప్రాణవాయువు మొక్కలను నాటనున్నారు.
మరోవైపు సుమారు రూ.200 కోట్లతో రామాలయ అభివృద్ధి పనులు, రూ.47 కోట్లతో ఘాట్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నింటినీ పుష్కరాల కంటే ముందే పూర్తి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
Comments
Loading comments...

