వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటిస్తూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ యు.కాశీనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, సిబ్బంది మధ్య సమన్వయం, పరస్పర సామరస్యం ఉండాలని సూచించారు.
ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా ,ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ప్రత్యేక శ్రద్ధతో పరీక్షించి, తక్షణ చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు మరియు మౌలిక వసతుల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీమాధవ్‌తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలను కాపాడటంలో రాజీ పడవద్దని ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

