వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలం గంగాయిపేట సమీప అడవుల్లో మేకలు మేపేందుకు వెళ్లిన లక్ష్మణ్‌పై ఎలుగుబంటి దాడి చేసింది. మూడు పిల్లలతో వెళ్తున్న ఎలుగుబంటిని చూసి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కగా, ఎలుగుబంటి చెట్టును ఊపడంతో కిందపడ్డాడు.
కిందపడిన లక్ష్మణ్‌పై ఎలుగుబంటి దాడి చేయగా, అతడు గట్టిగా అరవడంతో మేకలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గాయపడిన లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

