వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు, స్థానికులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ కలల ప్రాజెక్టును కాంట్రాక్టర్లకు అప్పగించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో సాకు చూపుతూ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని, దీనివల్ల నిర్వాసితులు, స్థానికులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రాణాలకు తెగించైనా ప్లాంట్‌ను కాపాడుకుంటామని నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

