Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బాన్సువాడ పంటలకు నిజాంసాగర్ నీరు

Rohit Jun 11, 2026 6:24 AM నిజామాబాద్ 7 views4 days ago
బాన్సువాడ పంటలకు నిజాంసాగర్ నీరు - Udayam Digital
వానాకాలం సీజన్‌కు బాన్సువాడ నియోజకవర్గ రైతులకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జాకోరా - చందూర్‌ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి, సిద్దాపూర్ జలాశయ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వ ప్రాజెక్టుల డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించిన మంత్రి, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయన్నారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా మోస్రా, చందూర్, వర్ని మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...