వార్తలకు తిరిగి వెళ్లండి

బాసెల్ టెన్నిస్ టోర్నీలో నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఉగో హంబర్ట్‌పై 4-6, 6-3, 6-4తో విజయం సాధించాడు. తొలి సెట్ కోల్పోయినా పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో సీజన్ ముగింపు ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాలను జకోవిచ్ మెరుగుపర్చుకున్నాడు. తదుపరి రౌండ్‌లో జర్మనీ ఆటగాడు జాన్-లెనార్డ్ స్ట్రఫ్‌తో తలపడనున్నాడు.
Comments
Loading comments...

