Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల గణనాథుడి సన్నిధిలో ఘనంగా మహా అన్నదానం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 19, 2026 9:53 PM సంగారెడ్డిGeneral
బాల గణనాథుడి సన్నిధిలో ఘనంగా మహా అన్నదానం - Udayam
రామచంద్రాపురం మల్లికార్జుననగర్ కాలనీలో బాల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత ఏడేళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా బాల గణనాథుడిని ప్రతిష్టించామని, స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల కాలనీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...