Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:44 PM నాగర్ కర్నూల్General
ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం - Udayam
చారకొండలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉపసర్పంచ్ మల్లేశ్ శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ గాయత్రి రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. నిత్య జీవితంలో ఆయుర్వేదాన్ని పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. ఫార్మసిస్టులు బిచ్యానాయక్, నర్మద, సిబ్బంది దేవేందర్, కవిత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...