Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామయ్యకే ఘోర అవమానం: ఇక్బాల్ అన్సారీ

భవేష్ కుమార్ Jun 27, 2026 5:47 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
అయోధ్య రామయ్యకే ఘోర అవమానం: ఇక్బాల్ అన్సారీ - Udayam Digital
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై బాబ్రీ మసీదు మాజీ వాది ఇక్బాల్ అన్సారీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ఈ క్షేత్రంలో ఏకంగా స్వామివారి నెక్లెస్, పాదుకలనే దొంగిలించడం అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. హిందూ విశ్వాసాలను గౌరవించాలని ముస్లింలకు చెప్పానని, కానీ బాధ్యతగలవారే ఇలా చేయడం దారుణమన్నారు. ఈ దోపిడీకి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి అన్సారీ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...