వార్తలకు తిరిగి వెళ్లండి

గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో తమ పేరున క్రమబద్ధీకరించుకుని విక్రయించేందుకు యత్నించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైకోర్టు గతంలోనే వారి పిటిషన్లను కొట్టివేసినా, ముఠా సభ్యులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో కలిసి కుట్రకు తెరలేపారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, మాజీ ఎమ్మెల్యే సహా పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

