వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో నలుగురికి ఐదేళ్ల సాధారణ జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు 1వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 4న మెక్లీన్స్ రోడ్డులో పాతకక్షల నేపథ్యంలో దాడి జరిగింది.
నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెలరోజుల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

