వార్తలకు తిరిగి వెళ్లండి
వర్ధన్నపేట నియోజకవర్గం, గీసుగొండ మండలం కోటిలింగాల గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్‌పై పత్తి కుమార్ అనే రౌడీషీటర్ పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించాడు.
మరో కార్యకర్త జున్ను మధు ఫోన్ చేసి పిలవగా అక్కడికి వెళ్లిన మహేష్‌ను, 'నా గురించి ఎమ్మెల్యేకి ఏం చెప్పావు?' అని నిలదీస్తూ పత్తి కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే, గతంలో జీవిత ఖైదు శిక్ష పడిన ఒక రౌడీషీటర్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Loading comments...

