వార్తలకు తిరిగి వెళ్లండి

బుక్కరాయసముద్రంలో జరిగిన ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై జల్లిపల్లి టోల్ గేట్ వద్ద కూడేరు సీఐ రాజు, ఉరవకొండ ఎస్సై జనార్దన్ నాయుడు నేతృత్వంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.
సందేహాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు ఎక్కడికి పారిపోయారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

