Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎంలో నగదు లేదు.. శునకాలేమో కాపలా!

Follow Udayam on Google
Harika Jun 13, 2026 2:55 PM పెద్దపల్లి General
ఏటీఎంలో నగదు లేదు.. శునకాలేమో కాపలా! - Udayam
రామగిరి మండలంలోని ఏటీఎంలలో నిరంతరం నగదు కొరత వేధిస్తోంది. డబ్బులు లేక 'నో మనీ' బోర్డులతో ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. సెలవు దినాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సెంటినరీ కాలనీ ఏటీఎం వద్ద వింత దృశ్యం కనిపించింది. నగదు లేక వినియోగదారులు రాకపోవడంతో, ఏటీఎం ప్రవేశ ద్వారం వద్ద శునకాలు సేదతీరుతూ కనిపించాయి. ఏటీఎంకు ఇవే కాపలా అంటూ స్థానికులు సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగదు కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...