వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ మండలం రామప్ప ఆయకట్టు శివారులో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. గత రెండు రోజులుగా అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న తేలికపాటి వర్షాలు, ఈదురు గాలులకు వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వరి గింజలు పాలు పోసుకునే దశలో ఉన్నాయని, పంట నేలకొరగడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

