వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సంబంధించి ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (CEE) జూన్ 1 నుండి 12 వరకు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, తెలుగుతో సహా 13 భాషల్లో ఈ పరీక్ష రాయవచ్చని పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో శారీరక, ధృవపత్రాల పరిశీలన పరీక్షలు నిర్వహిస్తారు.
Comments
Loading comments...

