Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించండి

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:19 PM చిత్తూరుGeneral
పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించండి - Udayam
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గుడిపాల పీహెచ్‌సీలో డా. చంద్రమహేష్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 25న 1–19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం నివారించేందుకు మాత్రలు ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన పిల్లలకు మాత్రలు వేయించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...