వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో భారీగా బదిలీలు, పదోన్నతులు జరిగాయి. నూతన డీఎంఈగా డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. పదోన్నతి పొందిన 15 మంది ఏడీఎంఈలకు పోస్టింగులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు కొత్త ప్రిన్సిపల్స్, తొమ్మిది మంది సూపరింటెండెంట్‌ల నియామకం చేపట్టింది.
విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ రఘునందన్, విశాఖ విమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ మన్మథరావు నియమితులయ్యారు. కాకినాడ, పాడేరు, పిడుగురాళ్ల, ఒంగోలు వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపల్స్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

