Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

Sonia Singh May 22, 2026 1:02 PM అమరావతి 8 views5 days ago
ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. వీటి తయారీని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని, అందుకు అన్ని వర్గాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...