వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ బడ్జెట్‌లో జీతాలు, వడ్డీలు, పింఛన్లకే అధిక మొత్తం ఖర్చవుతోంది. పింఛన్ల కంటే అప్పుల వడ్డీల చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్రం నిరంతరం చేబదుళ్లపైనే ఆధారపడుతోందని కాగ్ నివేదిక హెచ్చరించింది.
రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి ప్రజారుణాన్ని వాడుకుంటూ, మూలధన వ్యయం తక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందుంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ద్రవ్యలోటు ఏటా పెరుగుతూ వస్తోంది.
Comments
Loading comments...

