వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం నుంచి భక్తిశ్రద్ధలతో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ విజయరాజు తెలిపారు.
ఈఓ మాట్లాడుతూ..ఈ శ్రావణమాసం సందర్భంగా ప్రతి మంగళ, శనివారాలలో ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు.
Comments
Loading comments...

