వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండ సంజయ్ కాలనీలో బాలగంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో కాలనీకి చెందిన షేక్ ఆజీజ్ రూ.20,116కు లడ్డూను దక్కించుకున్నారు.
కాలనీలో అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటామని, లడ్డూను దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆజీజ్ తెలిపారు. ఆయనను పట్టణవాసులు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

